

కన్న సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాధురి ప్రజెంట్స్, ప్యాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్య రావు హాజరయ్యారు. హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్ మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. చైతన్య రావు చేతుల మీదుగా టీజర్ విడుదల అయింది. ఈ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా నటుడు వెంకీ మాట్లాడుతూ చిన్న సినిమా అయినా అందరికీ గుర్తుండే సినిమా అవుతుందని అన్నారు. గీతికా రథన్ మాట్లాడుతూ టీజర్ చూసినప్పుడు చిన్న సినిమా అనిపించదని, తాను సత్య అనే పాత్ర పోషించానని తెలిపారు. ఈ సినిమా తర్వాత అందరూ తనను సత్యగా గుర్తుపెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో కార్తిక్ శివన్ మాట్లాడుతూ తనకు కుటుంబం తప్ప సినిమా నేపథ్యం లేదని, ఈ సినిమా తనకు గుర్తింపును తీసుకువస్తుందని చెప్పారు. ఈ సినిమా క్రికెట్, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుగా ఉంటుందని తెలిపారు.
నిర్మాత కృష్ణ మాట్లాడుతూ దర్శకుడు ఎంతో సహనంతో ఈ సినిమాను తీర్చిదిద్దారని చెప్పారు. దర్శకుడు నాని కాసరగడ్డ మాట్లాడుతూ టీజర్ ఒక పూర్తి ట్రైలర్ లా అనిపించిందని, ఇందులో ఉన్న కృషి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా సరదాగా సాగుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని చెప్పారు. చైతన్య రావు మాట్లాడుతూ ఈ సినిమా విజువల్స్, సంగీతం, నటన అన్నీ బాగా ఉన్నాయని, ఇలాంటి చిన్న సినిమాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నానని తెలిపారు.







.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!