

పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. బెంగాలీలను తమ రాష్ట్రంలో మైనారిటీలుగా మారనీయబోమని ఆయన స్పష్టం చేశారు. ముర్షిదాబాద్ జిల్లా జంగీపూర్, పూర్బ బర్దమాన్ జిల్లా కట్వా పట్టణాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక పోరాటంగా ఆయన అభివర్ణించారు.
రాష్ట్రంలో బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలకడానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమని మోదీ తెలిపారు. శ్రీ రామనవమి సందర్భంగా జరిగిన హింసను ప్రస్తావిస్తూ, దానికి బాధ్యులైన వారిని తృణమూల్ కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు. అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. శరణార్థులకు పౌరసత్వం కల్పించే చర్యలను వేగవంతం చేస్తామని, చొరబాటుదారులు దేశాన్ని విడిచి వెళ్లాల్సిందేనని ఆయన అన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!