
రివ్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' షూటింగ్ కొనసాగుతోంది. పీరియాడిక్ యాక్షన్, పేట్రియాట్ జానర్‌లో రానున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ పాత్రకు నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ డిజైన్ చేశారట మేకర్స్.
హను రాఘవపూడి ఇప్పటి వరకు సాఫ్ట్ లవ్ స్టోరీలు చూపించినా, ఈసారి సాలిడ్ మాస్ సీన్స్‌తో మాస్ డైరెక్టర్‌గా మారబోతున్నారు. ఫౌజీలో ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఈ సినిమాకు భారీ ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఈ ఇయర్ లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!