.png&w=3840&q=75)

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ, మ్యాచ్‌కు ముందు కాలుకు పట్టీతో కనిపించడంతో అతడు ఆడతాడా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయినప్పటికీ, జట్టుకు అవసరమైన సమయంలో క్రీజ్‌లోకి వచ్చి 49 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, కానీ గత మ్యాచ్‌తో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నానని తెలిపాడు. ముంబయి మ్యాచ్‌లో గాయం తగిలిందని వెల్లడించాడు. బెంగళూరులో ఉన్న వేడి పరిస్థితులు, పిచ్ మందకొడిగా మారడం వల్ల బ్యాటింగ్ కష్టంగా మారిందని చెప్పాడు. టీ20ల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం కీలకమని పేర్కొన్నాడు. అలాగే జట్టులోని టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ వంటి ఆటగాళ్లు వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం జట్టుకు బలమని తెలిపాడు.










.png&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!