
సినిమాలు

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత జాతీయ కాంగ్రెస్ బారామతి ఉప ఎన్నిక బరిలోకి దిగుతూ ఆకాశ్ విశ్వనాథ్ మోర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశం లేకుండా పోయింది. ఏప్రిల్ 23 న జరగనున్న ఈ ఎన్నికలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్‌తో మోర్ తలపడనున్నారు.
అజిత్ పవార్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది. ఆయన గౌరవార్థం ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించాలని సునేత్ర పవార్ అన్ని పార్టీలను కోరారు. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఇప్పటికే పోటీ చేయబోమని ప్రకటించగా, ఉద్ధవ్ థాకరే మద్దతును కూడా కోరారు. అయితే కాంగ్రెస్ ఈ అభ్యర్థనను తిరస్కరించి పోటీకి దిగడంతో బారామతి ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!