

వైఎస్సార్ కడప జిల్లాలోని కోదండరామా టెంపుల్ లో సీతారాముల కల్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయాన్ని TTD ప్రత్యేకంగా అలంకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే తితిదే తరఫున ఒక కిలో బంగారంతో తయారు చేసిన స్వర్ణముఖ పట్టీని కానుకగా అందజేశారు.
కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు లడ్డూ ప్రసాదం కూడా అందజేశారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఈ వేడుక ఎంతో వైభవంగా కొనసాగింది. కల్యాణ మండపాన్ని దేశ విదేశాల నుంచి తెచ్చిన పుష్పాలతో అందంగా అలంకరించారు. జైశ్రీరామ్ నామస్మరణతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ వేడుకలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మంత్రులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!