
క్రీడలు

బాలయ్య – గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న రెండో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ నెల మూడో వారం నుంచి గోపీచంద్ మలినేని కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్యపై ఓ సూపర్ సాంగ్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బాలయ్యను మహారాజుగా చూపించగా, నయనతార మహారాణి పాత్రలో కనిపించనుందని సమాచారం. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. గతంలో బాలయ్య – నయన్ కాంబో ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి హిట్ సినిమాలు ఇచ్చింది. సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!