

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్కార్ అభిమానులకు శుభవార్త అందింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2029 నుంచి 2033 వరకు ఆస్కార్ అవార్డ్స్ వేడుకలను ఎక్స్‌క్లూజివ్‌గా యూట్యూబ్‌లో స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించింది. గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌తో అకాడమీ మల్టీ ఇయర్ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం కేవలం ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమమే కాకుండా రెడ్ కార్పెట్ ప్రీ-షో, బిహైండ్-ది-సీన్స్ కంటెంట్, గవర్నర్స్ అవార్డ్స్, నామినేషన్స్ ప్రకటన, నామినీస్ లంచన్, స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డ్స్ వంటి అనేక కార్యక్రమాలు కూడా ఆస్కార్ల అధికారిక యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా అకాడమీ సీఈఓ బిల్ క్రామర్, ప్రెసిడెంట్ లినెట్ హావెల్ టేలర్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ఆస్కార్లను ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేస్తుందని అన్నారు. మరోవైపు యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ మాట్లాడుతూ, ఆస్కార్లు కథన శక్తిని, కళాత్మకతను గౌరవించే గొప్ప సాంస్కృతిక వేదిక అని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.






.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!