
.jpeg&w=3840&q=75)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇటీవల చేపట్టిన పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా జోన్ వారీ, సర్కిల్ వారీ వివరాలను విడుదల చేసింది. ఈ జాబితాలో సెరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, చార్మినార్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, శంషాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ వంటి జోన్లకు సంబంధించిన సర్కిల్స్ మరియు వాటి పరిధిలో ఉన్న మున్సిపల్, జోనల్, సర్కిల్, వార్డ్ కార్యాలయాల స్థానాలను స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ పునర్విభజనలో ఇప్పటికే ఉన్న మున్సిపల్, వార్డ్ కార్యాలయాల నుంచే కొన్ని సర్కిల్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు, అలాగే కొన్ని సర్కిల్ కార్యాలయాలు జోనల్ కార్యాలయాలుగా కూడా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ విస్తరించిన పరిధిలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. కొత్త నిర్మాణం ద్వారా ప్రజలకు సేవలు వేగంగా, సులభంగా అందేలా చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.








.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!