

నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, లయన్ గేట్స్ వంటి కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎలాంటి యాడ్స్ లేకుండా కంటెంట్ అందిస్తూ, సబ్స్క్రైబర్ల డబ్బుకు పూర్తి న్యాయం చేస్తున్నాయి. వీక్షకులకు అంతరాయం లేకుండా వినోదం ఇవ్వడంతో పాటు వారి విలువైన సమయాన్ని కూడా ఆదా చేస్తున్నాయి. ఈ విధానం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది.
అయితే జియో హాట్ స్టార్, జీ 5, ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రధాన ఓటీటీలు మాత్రం యాడ్స్‌తో విసుగు తెప్పిస్తున్నాయని పబ్లిక్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే మొబైల్, సూపర్, బేస్ ప్లాన్లలో కంటెంట్ చూస్తున్నప్పుడు యాడ్స్ ఎక్కువగా వస్తుండటంతో చూసేవారికి చిరాకు పెరుగుతోంది. సినిమా చూస్తున్నామా, యాడ్స్ చూస్తున్నామా అనే గందరగోళం కూడా కలుగుతోంది.
కంటెంట్ కన్నా యాడ్స్ ఎక్కువగా రావడంతో వీక్షకుల సహనం పరీక్షకు గురవుతోంది. కొన్ని సందర్భాల్లో “ఇలాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకున్నాం?” అంటూ పబ్లిక్ బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ యాడ్స్ సమస్యపై ఓటీటీలు స్పందించాలని ప్రేక్షకులు కోరుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!