
గాసిప్స్

మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ 2026 కిరీటాన్ని డాక్టర్ దివ్య వారణాసి దక్కించుకున్నారని సీతమ్మధారలోని ఇలాహే మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ స్థాపకురాలు భారతి బెర్లి తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల వివరాలను వెల్లడిస్తూ, వైద్య వృత్తిలో కొనసాగుతూ మోడలింగ్‌పై ఆసక్తితో శిక్షణ పొంది విజేతగా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.
వంద మందికిపైగా పాల్గొన్న ఈ పోటీల్లో డాక్టర్ దివ్య ప్రతిభ చాటుకుని కిరీటం సొంతం చేసుకున్నారు. ఏప్రిల్‌లో నిర్వహించనున్న మిస్ గ్రాండ్ ఇండియా ఫైనల్స్‌లో ఆమె ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొననున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా ఆమె ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!