
రాజకీయాలు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టుల దాడి కలకలం రేపింది. బీజాపూర్ జిల్లాలోని తార్లగూడెం పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు మరికెళ్ల అడవుల్లో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. అన్నారం-మరికెళ్ల అడవుల్లో ఆపరేషన్ కొనసాగుతుండగా రెండు వైపులా తీవ్ర కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఇదే ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ ఆపరేషన్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం భద్రతా బలగాలు అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!