

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన స్నేహితురాలు సోఫీ షైన్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈనెల 12 న జరిగిన ఈ నిశ్చితార్థం విషయాన్ని ధావన్ స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ, శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో పెళ్లి వేడుకలు నిర్వహించే అవకాశముందని సమాచారం.
రిపోర్టుల ప్రకారం వచ్చే నెల 14 లేదా 15 తేదీల్లో వివాహం జరగవచ్చని తెలుస్తోంది. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో తొలిసారిగా కలిసి కనిపించిన ఈ జంట, తమ సంబంధాన్ని కొంతకాలం గోప్యంగా ఉంచింది. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ మార్కెటింగ్, మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు ప్రస్తుతం శిఖర్ ధావన్ ఫౌండేషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేస్తూ, వివిధ సామాజిక కార్యక్రమాల్లో ధావన్‌తో కలిసి చురుకుగా పాల్గొంటున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!