

తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేశారు. మనిషిని నిజంగా ఉన్నత స్థితిలో నిలబెట్టేది క్షమాగుణమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచం నుంచి మనం ఎంతో కొంత పొందుతున్నందున, ప్రపంచానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.
భౌతిక సుఖాలు తాత్కాలికమని, మానసిక సంతృప్తి లేకపోతే ఎంత సంపాదించినా నిజమైన ఆనందం లభించదని పేర్కొన్నారు. కొందరిలో ఎదుగుదలతో పాటు అహంకారం కూడా పెరుగుతుందని, అలాంటి దృక్పథం సమాజానికి హానికరమని హెచ్చరించారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో సౌకర్యాలతో పాటు వినాశనం కూడా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. విజ్ఞానం మానవ జీవితాన్ని సులభతరం చేస్తుందని, కానీ అంతర్గత జ్ఞానం లేకపోతే సమతుల్యత ఉండదని తెలిపారు. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ ఉన్న వాడే నిజమైన మనిషి అని ఆయన వివరించారు.
భారత్ భవిష్యత్తులో ప్రపంచానికి దారి చూపే స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, ఆర్థిక, సామాజిక, ధార్మిక జ్ఞానాల ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత భారతదేశానిదేనని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!