

ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “ఇవాళ మా వద్ద మొత్తం 1,800 విమాన సర్వీసులు సాధారణంగా నడుస్తున్నాయి. ఇకపై ఇండిగో విమానాల్లో ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ప్రయాణికులకు కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని చెప్పారు. ఇటీవల ఎదురైన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు, సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
అలాగే, మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది చాలా కష్టపడుతున్నారని, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు. ఇటీవల తమ ప్రయాణం ప్రభావితమైన లక్షలాది మందికి పూర్తి రీఫండ్లు చెల్లించినట్లు కూడా వెల్లడించారు. మరింత శ్రద్ధ తీసుకుని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇండిగో సేవలను మరింత బలోపేతం చేస్తామని పీటర్ ఎల్బర్స్ హామీ ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!