

నాంపల్లి ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోబో ఫైర్ మిషన్ సహాయంతో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. భవనంలో సెల్లార్ మొత్తం ఫర్నీచర్‌తో నిండివుండటంతో సహాయక చర్యలకు కష్టాలు ఎదురయ్యాయి. మంటలు నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి, దీన్ని ఆర్పడానికి 8 ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నారు.
స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, భవనంలోని రెండు చిన్నారులు అఖిల్ (7) మరియు ప్రణీత్ (11) ఇంకా లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గోడాం వద్ద పనిచేస్తున్న మూడు కుటుంబాల నుంచి మొత్తం ఆరుగురు చిక్కుకున్నారని గుర్తించారు. వీరిలో వాచ్మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు, మరో కుటుంబంలోని నలుగురు పెద్దవారు చిక్కుకుపోయారు.
నాంపల్లి పరిసర ప్రాంతాల్లో, అబిడ్స్, MJ మార్కెట్, ఏక్‌మినార్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. పోలీసులు ప్రజలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌కు రాకుండా, పర్యటనలను వాయిదా వేయమని సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!