

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే - 5 గనిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గనిలో పనిచేసే కార్మికులకు సంబంధించిన ల్యాంప్ రూమ్‌లో మంటలు చెలరేగి, సుమారు 1,500 మైనింగ్ ల్యాంప్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన వల్ల సింగరేణి సంస్థకు భారీ ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం.
అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం, ల్యాంప్ రూమ్‌లో బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ల వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై, సమీపంలో నిల్వ ఉంచిన పెట్రోల్ క్యాన్లను బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కాలిపోయిన ల్యాంప్‌ల విలువ సుమారు రూ.50 లక్షలుగా అంచనా వేయగా, ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!