
బిజినెస్

నేరం జరిగిన చోటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం TGICCC అధికారులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. ప్రమాదాలు, అసహజ మరణాల కేసులలో ఎఫ్ఐఆర్ను ఘటనా స్థలిలోనే లేదా ఆస్పత్రిలోనే నమోదు చేయాలని పేర్కొన్నారు.
బాధితులను లేదా వారి కుటుంబ సభ్యులను అనవసరంగా పోలీస్ స్టేషన్కు పిలవకూడదని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి బాధితులను ఇబ్బంది పెడితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని, మానవీయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సజ్జనార్ సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!