

పాకిస్థాన్ మరియు అఫ్గానిస్థాన్ మధ్య డ్యురాండ్ రేఖ వెంబడి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చి బహిరంగ యుద్ధంగా మారుతున్నాయి. పాకిస్థాన్ అఫ్గానిస్థాన్లో వైమానిక దాడులు జరపడంతో తాలిబాన్లు తీవ్రంగా స్పందించి సరిహద్దుల్లోని పాక్ సైనిక స్థావరాలపై ప్రతిదాడులు ప్రారంభించారు. తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా ప్రతీకార దాడులను ప్రకటించారు. అనంతరం పాక్ ఫైటర్ జెట్లు కాబూల్, కాందహార్, పక్తియా నగరాల్లో బాంబు దాడులు జరిపినట్లు సమాచారం.
మృతుల సంఖ్య పై రెండు దేశాలు భిన్న ప్రకటనలు చేశాయి. 133 తాలిబాన్ యోధులను హతమార్చామని పాక్ తెలిపితే, తమవారు కేవలం ఎనిమిది మందే మృతి చెందారని తాలిబాన్లు పేర్కొన్నారు. పాక్ సైనికులలో ఇద్దరే మరణించారని పాక్ అధికారులు స్పష్టం చేశారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ అఫ్గానిస్థాన్తో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైందని ప్రకటించారు.
ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో నంగర్హార్లో ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. పాక్ ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని తాలిబాన్లు ప్రకటించగా, ఆ ఆరోపణలను ఇస్లామాబాద్ ఖండించింది. ఈ ఘర్షణలను వెంటనే ఆపాలని ఇరాన్ రెండు దేశాలకు సూచిస్తూ మధ్యవర్తిత్వానికి సిద్ధమని తెలిపింది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!