

ఆంధ్రప్రదేశ్‌లో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలో గూడ్స్ రైలులో బోగీలు విడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) లోడ్‌తో కర్ణాటకలోని మంగళూరుకు వెళ్తున్న గూడ్స్ రైలులో ఈ అనూహ్య పరిణామం జరిగింది.
మొత్తం 60 బోగీలతో ప్రయాణిస్తున్న ఈ గూడ్స్ రైలులో ఆరో బోగీ వద్ద బోగీ లింక్ అకస్మాత్తుగా తెగిపోయింది. దాంతో ఇంజిన్‌కు అనుసంధానమైన భాగం సుమారు రెండు కిలోమీటర్ల వరకు ముందుకు వెళ్లింది. బోగీలు విడిపోయిన విషయాన్ని వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై గూడ్స్ రైలును నిలిపివేశారు. అదే సమయంలో ఆ ట్రాక్ పై మరో రైలు లేకపోవడంతో పెను ప్రమాదం జరగకుండా తప్పింది.
ఈ ఘటనతో కొద్దిసేపు రైల్వే సిబ్బంది, స్థానికుల్లో ఆందోళన నెలకొనగా, అధికారులు పరిస్థితిని త్వరగా అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనకు గల కారణాలపై రైల్వే శాఖ విచారణ చేపట్టింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!