

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన వ్యవహారాలను నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులను నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాలపై అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరించింది. కేరళకు చెందిన సి.కె. సురేష్‌బాబు అనే భక్తుడు ‘కర్ణాటక ప్రవాసి సౌధ’ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘటనపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తులో, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తిరుమల ఆలయ చిత్రాలు, టీటీడీ పేరును ఉపయోగించి నకిలీ వెబ్సైట్లు సృష్టించి గూగుల్‌లో ప్రచారం చేస్తున్నట్లు తేలింది. ఇవి అధికారిక బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లుగా నటిస్తూ ఆన్లైన్లో డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసి, కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేసింది. దర్శనం, వసతి, సేవా టికెట్లు కేవలం అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. అనుమానాస్పద వెబ్సైట్లు, లింకులు, ఫోన్ కాల్స్‌పై వెంటనే సమాచారం ఇవ్వాలని భక్తులను కోరింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!