
గాసిప్స్

భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబు పేలుడు సంభవించింది. స్టేషన్లో వదిలివేయబడిన ఒక సంచిలో నాటు బాంబు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంచిని అక్కడ తిరుగుతున్న ఓ కుక్క కొరకడంతో బాంబు అకస్మాత్తుగా పేలిపోయింది. తీవ్ర ప్రభావంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది.
పేలుడు చోటుచేసుకున్న సమయంలో స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని రైల్వే స్టేషన్ను పూర్తిగా తనిఖీ చేసి, సంచిలో బాంబు ఎలా పెట్టారు? ఎవరు వదిలివేశారు? అనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!