
న్యూస్

టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘంకు లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని రెండు గంటలు పెంచాలని కోరారు. ఎన్నికల సమయంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఓటు వేయలేకపోతున్నారని, ఇది ఓటర్లను అడ్డుకునే కుట్రగా కనిపిస్తోందని విజయ్ ఆరోపించారు. అదనపు బస్సులు ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఈసీని కోరారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!