

తమిళ నటుడు రవి మోహన్ ప్రస్తుతం విడాకుల వ్యవహారం ఒకవైపు, గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలతో మరోవైపు వార్తల్లో నిలుస్తున్నాడు. విడాకులు పూర్తికాకముందే ఆమెతో కలిసి తిరుగుతున్నందుకు ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా తన ప్రియురాలి కోసం గోవాలో భూమి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రిపోర్టుల ప్రకారం రవి మోహన్, కెనీషా ఫ్రాన్సిస్ కలిసి గోవాలో సుమారు 40 - 42 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాల్లో రవి మోహన్.. అన్ మ్యారీడ్ అంటూ తనకింకా పెళ్లవలేదని పేర్కొన్నాడట! విడాకులు మంజూరు కాకముందే సింగిల్ అని ఎలా పేర్కొంటారని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
ఇది ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు రిజిస్ట్రేషన్ సమయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. రవి మోహన్ ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కూతురు ఆర్తిని 2009 లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ సంతానం. 2024 లో రవి మోహన్, ఆర్తి విడిపోయారు. అయితే చట్టపరంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇకపోతే జయం మూవీతో బ్రేక్ అందుకుని జయం రవిగా కొనసాగుతున్న ఆయన.. గతేడాది జనవరిలో తన పేరు మార్చుకున్నాడు. ఇకపై జయం రవి కాకుండా రవి మోహన్ అనే పిలవాలని కోరాడు. చివరగా పరాశక్తి సినిమాలో విలన్‌గా నటించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!