

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ అందించింది. భారత్‌లో తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను 50 శాతం విస్తరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 400 సర్వీస్ సెంటర్లను 600కు పెంచే ప్రణాళికను వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లలో కంపెనీ మూతపడుతోందన్న వదంతుల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
సొంత బ్రాండ్‌గా ప్రారంభమైన వన్‌ప్లస్, పోటీ పెరుగుతున్న నేపథ్యంలో తన మార్కెట్ ప్రభావాన్ని కొంతవరకు కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలోనే మాతృ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ఒప్పో సంస్థకు సబ్‌బ్రాండ్‌గా మారి కార్యకలాపాలను కొనసాగిస్తోంది. గత కొన్నేళ్లుగా ఒప్పోతో కలిసి ఫోన్లను విడుదల చేస్తోంది. మార్కెట్ వాటా తగ్గుతున్న నేపథ్యంలో వన్‌ప్లస్‌ను మూసివేస్తున్నారన్న ప్రచారం కూడా సాగింది. ఇటీవల కంపెనీ సీఈఓ రాబిన్ లియు రాజీనామా చేయడం ఈ వదంతులకు మరింత ఊతమిచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని కంపెనీ ఖండిస్తూ, భారత్‌లో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
వన్‌ప్లస్ తన సొంత సర్వీస్ సెంటర్లను నిర్మించకుండా, ఇప్పటికే ఉన్న ఒప్పో సర్వీస్ సెంటర్లనే వినియోగించుకోనుంది. దీని ద్వారా వినియోగదారులకు సేవలు మరింత సులభంగా అందుతాయని తెలిపింది. విస్తరించిన ఈ సేవలు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ విస్తరణపై దృష్టి సారించినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే, వచ్చే నెల 7న వన్‌ప్లస్ నార్డ్ 6ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!