

హైదరాబాద్‌లో వారాంతంలో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్‌పై తెలంగాణ ఈగల్ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. పోలీసులు అనుమతి ఇవ్వకముందే ఈ ఈవెంట్ ప్రారంభించారని సమాచారం. మద్యం వినియోగానికి మాత్రం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్నట్లు తెలిసింది.
ఈ వేడుకకు 200 మందికి పైగా హాజరయ్యారు. డ్రగ్స్ వినియోగంపై అనుమానం రావడంతో ఈగల్ డీఎస్పీ భిక్షపతి ఆధ్వర్యంలో పోలీసులు రాత్రి సోదాలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న 36 మందిని డ్రగ్స్ టెస్టింగ్ కిట్లతో పరీక్షించగా, ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పాజిటివ్ వచ్చిన వారిలో పరం సి నిహార్, ఆశి, యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, జాసన్ వంటి వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!