

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఒక భారీ వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్, ఈ మూవీ తన ‘డి-సాహెబ్’ కథ నుండి కాపీ చేశారని ఆరోపించారు. 2023 లో తాను రిజిస్టర్ చేసుకున్న కథలోని పాత్రలు, సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
ఈ ఆరోపణలపై ఆదిత్య ధర్ లీగల్ టీమ్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ, సంతోష్ కుమార్కు లీగల్ నోటీసులు పంపింది. ఇక సంతోష్ కూడా వెనక్కి తగ్గకుండా, తన వద్ద స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆధారాలు ఉన్నాయని, కోర్టులో కేసు వేయడానికి సిద్ధమని తెలిపాడు. అయితే ఈ వివాదం సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1500 కోట్లను దాటి, 2000 కోట్ల దిశగా దూసుకెళ్తూ సంచలనం సృష్టిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!