

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ దుబాయ్‌లోని దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం కాన్సులేట్ సమీప ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరగడంతో భారీ మంటలు చెలరేగాయి. అత్యవసర బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ధ్రువీకరించారు. కాన్సులేట్ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇదిలా ఉండగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. రాయబార కార్యాలయంలో ఉన్న Central Intelligence Agency స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు డ్రోన్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో భవనం వద్ద దట్టమైన పొగ వ్యాపించగా కొంత భాగం దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.




.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!