
.webp&w=3840&q=75)
గ్రామాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జలజీవన్ మిషన్ (జేజేఎం) కింద 2028 నాటికి కుళాయిల ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. జేజేఎం 2.0 అమలుకు సంబంధించి కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రామీణ తాగునీటి సరఫరాలో ఆపరేషన్, మెయింటెనెన్స్కు ప్రాధాన్యం ఇస్తున్నామని, పంచాయతీలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాలకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కూడా పేర్కొన్నారు. జేజేఎం పొడిగింపుకు సహకరించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఒప్పందంతో గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు. 2028 డిసెంబరుకల్లా ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!