
గాసిప్స్

నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. అనేక కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు FSLలో ఉన్నాయని పేర్కొన్న ఆయన, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఏర్పడిన అనుమానాలను వెంటనే నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనలో ల్యాబ్‌లోని కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు దగ్ధమైనట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేపడతామని, అగ్నిప్రమాదాలపై పూర్తి అప్రమత్తతతో ఉన్నామని ఫైర్ డీజీ తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!