
సినిమాలు

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. “మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా?” అంటూ పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నాలు చేయొద్దని అన్నారు. నిబంధనల ప్రకారమే చర్యలు ఉంటాయని, వాహనం సీజ్ చేసి కోర్టు తేదీ ఇచ్చి న్యాయస్థానంలోనే మాట్లాడుకుందామన్నారు. మీ ప్రైవసీకి గౌరవం ఇస్తామని, కానీ చట్టం ముందు అందరూ సమానమేనని సజ్జనార్ తేల్చి చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఏమాత్రం ఉపేక్ష ఉండదని మరోసారి హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!