

తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి కుంభకోణంలో 15 మందిని అరెస్టు చేసినట్లు సన్ ప్రీత్‌సింగ్ వెల్లడించారు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రధాన నిందితులుగా బసవరాజు, జెల్లా పాండును గుర్తించినట్లు చెప్పారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో గతంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగగా, యాదగిరిగుట్టలోని ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మోసాలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ఈ కుంభకోణం ద్వారా సుమారు రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు సీపీ వివరించారు. వెబ్‌సైట్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. నిందితుల నుంచి రూ.63.19 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే సుమారు రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పేర్కొన్నారు.
_1771477764226.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!