

ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో, 1 నుంచి 9వ తరగతి మరియు 11వ తరగతి విద్యార్థులకు హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. Directorate of Education ఆదేశాల మేరకు, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలతో పాటు NDMC, MCD, ఢిల్లీ కాంటోన్మెంట్ బోర్డు పరిధిలోని విద్యాసంస్థలు ఈ విధానాన్ని అమలు చేయనున్నాయి.
ఈ ఆదేశాల ప్రకారం, విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు లేదా ఆన్లైన్ క్లాసులు ఏవైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే 10వ మరియు 12వ తరగతులకు ఈ హైబ్రిడ్ విధానం వర్తించదు. ఈ మార్పు గురించి తక్షణమే తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పాఠశాలలకు సూచించారు.
ఆదేశాల అమలు సక్రమంగా జరుగుతున్నదీ లేదీ పరిశీలించేందుకు జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో, GRAP స్టేజ్–IV చర్యలు అమలులోకి తీసుకువచ్చారు.
ఢిల్లీలో 24 గంటల సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 431కి చేరగా, ఆ తర్వాత 450ను దాటడంతో పరిస్థితి ‘సీవియర్ ప్లస్’ స్థాయికి చేరింది. అననుకూల వాతావరణ పరిస్థితులు, గాలివానలు లేకపోవడం, కాలుష్య కణాల పేరుకుపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!