
క్రీడలు

టీటీడీ పాలక మండలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.5,456.26 కోట్ల బడ్జెట్ అంచనాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో మొత్తం 86 అంశాలపై చర్చించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీలో శ్రీవారి ముడుపు పత్రం పథకం అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే ఒంటిమిట్ట కల్యాణానికి వచ్చే భక్తులకు లడ్డూలు అందించనున్నట్లు తెలిపారు. టీటీడీకి చెందిన విద్యాసంస్థల అభివృద్ధి కోసం రూ.118.89 కోట్లు కేటాయించారు.
తిరుమలలో మరో అన్నదాన భవనం, వంటశాల నిర్మాణం చేపడతామని చెప్పారు. అదేవిధంగా ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహంతో కూడిన ఐలాండ్ నిర్మాణానికి రూ.20.17 కోట్లు మంజూరు చేసినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!