
గాసిప్స్
.jpeg&w=3840&q=75)
ఉత్తరప్రదేశ్ లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధుర పరిధిలోని దిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘనమైన పొగ మంచు కారణంగా వరుసగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి.
ప్రమాద సమయంలో ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. ఢీకొన్న వెంటనే కొన్ని బస్సుల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదంలో గాయపడిన 25 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!