
సినిమాలు

రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ 2: ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నెల 19 న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది.
ఈ విజయంతో దర్శకుడు ఆదిత్య ధర్ పేరు మరోసారి మార్మోగుతోంది. వరుస విజయాలతో ఆయన స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ధురంధర్ ఫ్రాంఛైజీకి మూడో భాగం వస్తుందా అనే ఆసక్తి కొనసాగుతుండగా, ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇక ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!