

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చాలా మంది పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఇదే సమయంలో ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. పేరుకే హిందీ సినిమా అయినా ధురంధర్ 2కి తెలుగు ప్రాంతాల్లో కూడా మంచి స్పందన వచ్చింది. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అభిమానుల నుంచి మాత్రమే ఎక్కువ స్పందన కనిపించగా, సాధారణ ప్రేక్షకుల స్పందన మాత్రం తక్కువగానే ఉంది.
ఓటీటీ విషయానికి వస్తే, ధురంధర్ మొదటి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు రిలీజైన సీక్వెల్‌ని మాత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్‌కి చెందిన హాట్‌స్టార్‌కి ఇచ్చేశారు. థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు 8 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. అంటే మే చివర్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ చాలామంది దీన్ని థియేటర్లలోనే చూడాలని భావిస్తున్నారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేశారు. ఈ సినిమా సుమారు 5 వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని నిర్మాత తెలిపారు. అంటే వచ్చే నెల చివర్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇది తెరి రీమేక్ కాదని స్పష్టత వచ్చింది. అయితే సాధారణ కమర్షియల్ పోలీస్ కథతో రూపొందిన ఈ సినిమాకు ప్రస్తుతం మిక్స్‌డ్ నుంచి నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. వీకెండ్ తర్వాత పూర్తి స్థాయి స్పందన తెలుస్తుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!