
గాసిప్స్

భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌ను 2027 ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ హైస్పీడ్ రైలును ప్రారంభించనున్నారని తెలిపారు. మొదటి దశలో సూరత్ – బిలిమోరా మధ్య బుల్లెట్ ట్రైన్‌ను నడపనున్నట్లు వెల్లడించారు.
ఆ తర్వాత దశలవారీగా వాపీ–సూరత్, వాపీ–అహ్మదాబాద్, థానే–అహ్మదాబాద్ మార్గాల్లో బుల్లెట్ ట్రైన్లు ప్రారంభిస్తామని చెప్పారు. చివరికి పూర్తి స్థాయిలో ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందుకోసం ప్రత్యేక హైస్పీడ్ కారిడార్ నిర్మాణం జరుగుతోందని రైల్వే మంత్రి వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!