

హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్ వద్ద హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)కు వ్యతిరేకంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మరియు పలు క్రికెట్ సంఘాలు నిరసన చేపట్టాయి. క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని, ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా విశాఖ ఇండస్ట్రీస్‌కు బదిలీ చేసిన రూ.68.73 కోట్లు (దాదాపు రూ.70 కోట్లు) వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మెరుపు ధర్నా సమయంలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
అదే సమయంలో హెచ్‌సీఏ ప్రెస్ మీట్‌ను కూడా కొందరు క్రికెట్ సంఘాలు అడ్డుకున్నాయి. మంత్రి ఆదేశాల మేరకు హెచ్‌సీఏలో ఉన్న పెద్దలు రూ.70 కోట్లు విడుదల చేశారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్ పూర్తిగా ఖండించారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి చెక్కులపై సంతకం చేయలేదని, రూ.69 కోట్ల చెల్లింపులో తన పాత్ర లేదని చెప్పారు. ఆ చెల్లింపుల ప్రక్రియ తాను పదవి చేపట్టే ముందే ప్రారంభమైందని, కోర్టు ఆదేశాల మేరకే డబ్బులు చెల్లించామని స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!