
గాసిప్స్

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ ఇండియా టూర్’ సందర్భంగా జరిగిన గందరగోళం కేసులో నిర్వాహకుడు శతద్రు దత్తా కు కోర్టు బెయిల్ నిరాకరించింది. సాల్ట్‌లేక్ స్టేడియంలో అభిమానులకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో, హైదరాబాద్ వెళ్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు శతద్రును అరెస్టు చేశారు. బిధాన్నగర్ కోర్టు ఆయనను 14 రోజుల పోలీస్ కస్టడీకి పంపింది.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్టేడియాన్ని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటనకు దారితీసిన పరిస్థితులపై నివేదిక సిద్ధం చేస్తోంది. మరోవైపు మెస్సీ ఇండియా పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడగా, ఆదివారం ముంబై వాంఖడే స్టేడియంలో అభిమానులను కలుసుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!