

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వన్యప్రాణి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత, స్థిరత్వానికి వన్యప్రాణి సంరక్షణ అత్యంత కీలకమని అన్నారు. జూపార్కులు అంతరించిపోతున్న జీవజాతుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, జూపార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సూచించారు.
తల్లి శ్రీమతి అంజనాదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని జూపార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకొని వాటి సంరక్షణ ఖర్చులను భరిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జూపార్క్‌లోని వివిధ ఎన్క్లోజర్లు, జంతువుల సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్క్‌ను సందర్శించి నగరవనాన్ని ప్రారంభించి, కెనోపీ వాక్ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!