
గాసిప్స్

ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని కఠిన నిబంధనలు విధించింది. కోర్టు అనుమతి లేకుండా ఆయన విదేశాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.
అలాగే తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో జమ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఆయన స్వేచ్ఛగా ఇంటర్నెట్ ఉపయోగించకూడదని, పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఇంటర్నెట్ వాడాలని షరతులు విధించింది. ఈ నిబంధనలను పాటించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!