
న్యూస్

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ స్థాయికి చేరాయి.
సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా కొమురం భీమ్ జిల్లా గిన్నేదరి ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కావడం చలితీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.
తీవ్రమైన చలివల్ల ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. చలి నుంచి రక్షణ కోసం వెచ్చని దుస్తులు, దుప్పట్లు ఆశ్రయిస్తుండగా, చిన్నారులు మరియు వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!