
ఇటీవల ఐఏఎస్ బదిలీలతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఇద్దరు సీనియర్ అధికారులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్ మధ్య కొనసాగుతున్నడ్ వార్‌కు తెరపడినట్లుగా సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంతకాలం ఒకే శాఖకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించడంతో ఇద్దరి మధ్య అధికారపరమైన విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, పరిశ్రమల శాఖను చూసిన జయేశ్ రంజన్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే శాఖలో కొనసాగడం విమర్శలకు దారితీసింది. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో ఆయన్ను ఆ శాఖ నుంచి తప్పించి, బాధ్యతలను సంజయ్ కుమార్‌కు అప్పగించారు. అయితే జయేశ్‌ను సీఎంఓలోకి తీసుకుని ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా నియమించడంతో ఆయన మళ్లీ పాత శాఖలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
బిజినెస్ రూల్స్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీనేపతి అయినప్పటికీ, కీలక నియామకాల్లో అధిపతి ఎదురవుతున్నట్లు సంజయ్ కుమార్ పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరినట్లు సమాచారం.
ఇక ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు కూడా శాఖలో జరుగుతున్న అంతర్గత జోక్యాలపై అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా రంజన్హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ శాఖకు బదిలీ చేయడంతో, అధికార విభేదాలకు స్పష్టత వచ్చిందని జయేశ్. ఇప్పుడు సంజయ్ కుమార్ తన సమర్థతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్న చర్చ కూడా సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!