

సంగారెడ్డి జిల్లా కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీ (Woxsen University) విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొని అలరించారు.
యూనివర్సిటీ ఫుట్‌బాల్ స్టేడియంలో విద్యార్థులతో కలిసి జట్టుగా ఆడి, తన క్రీడా ప్రతిభను మరోసారి చూపించారు. విద్యార్థులతో సమానంగా పరిగెత్తుతూ, పాస్‌లు ఇస్తూ, గోల్స్‌కు ట్రై చేస్తూ ఉత్సాహంగా ఆటను ఆస్వాదించారు. క్రీడలపై సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఆసక్తి విద్యార్థులను మరింత ప్రేరేపించింది.

ఈ ఉత్సాహం ఇక్కడితో ఆగదు. రేపు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సితో కలిసి గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. ప్రపంచ స్టార్ ప్లేయర్ మెస్సితో జరిగే ఈ మ్యాచ్‌కు ఇప్పటికే విశేష క్రేజ్ ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!