

ఈ నెల 18 న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి చేరుకుని బస చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఈ నెల 19 న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం సమ్మక్క – సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తారు. అనంతరం హైదరాబాద్కు చేరుకుని దావోస్ సదస్సుకు వెళ్లనున్నారు. అయితే దావోస్ పర్యటన నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని ఒక రోజు ముందే నిర్వహించే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మహాజాతరకు ముందే భక్తుల రద్దీ పెరుగుతోంది. వారాంతపు సెలవుల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చి సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణ పనులు జరుగుతుండటంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతర సంప్రదాయంలో భాగంగా వనం పోతురాజు ఆధ్వర్యంలో సమ్మక్క దేవతను వనంలో నుంచి గద్దె వద్దకు తీసుకువచ్చే ఘట్టానికి ప్రాముఖ్యత ఉన్నందున, ప్రత్యేక గద్దె ఏర్పాటు చేయాలని ఆదివాసీ పూజారులు నిర్ణయించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!