

అమరావతి రాజధానిలో భారతదేశ తొలి క్వాంటం ఎకోసిస్టం అయిన అమరావతి క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఉద్దండరాయునిపాలెం వద్ద 50 ఎకరాల్లో నిర్మించనున్న క్వాంటం వ్యాలీ టవర్స్‌లో, ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ కలిసి భారత్‌లో తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా మారనుంది.
అలాగే ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు. అమరావతి క్వాంటం వ్యాలీ ప్రపంచ స్థాయి క్వాంటం నెర్వ్ సెంటర్‌గా రూపుదిద్దుకోనుందని ఐబీఎం ప్రతినిధి అమిత్ సింఘీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 35 క్యూఐసీలతో పాటు, భారత్‌లో తొలి క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ అమరావతిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!