
సినిమాలు

తెలంగాణ రాష్ట్రంలో చికెన్ వ్యాపారులు వచ్చే నెల 1 నుంచి తమ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇచ్చిన మార్జిన్ కంటే ప్రస్తుతం సుమారు రూ.20 తక్కువ ఇస్తున్నారని వారు చెబుతున్నారు. ఒకవైపు మార్కెట్లో చికెన్ ధర రోజురోజుకు పెరుగుతుండగా, మరోవైపు తమకు వచ్చే లాభం తగ్గిపోతుందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.360 నుంచి రూ.370 వరకు ఉంది.
పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం కష్టమైందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు షాపులను మూసివేయాల్సి వస్తుందని వారు తెలిపారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (1)
Very Sad