
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయంగా కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాజధాని అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సమావేశంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. అనంతరం ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాజధాని అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో ఈ సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!