

టెలివిజన్ వార్తా ఛానళ్లకు సంబంధించిన టెలివిజన్ రేటింగ్ పాయింట్ల నివేదికలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకాదరణను అంచనా వేసే సంస్థకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాలపాటు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని స్పష్టం చేసింది. అవసరమైతే పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కొన్ని వార్తా ఛానళ్లు అనవసర సంచలనాత్మక, ఊహాజనిత కథనాలు ప్రసారం చేస్తున్నట్లు కేంద్రం గమనించినట్లు సమాచారం. ఇటువంటి కథనాలు ప్రజల్లో అనవసర ఆందోళనలు, అపోహలు కలిగించే ప్రమాదం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్న ప్రజల్లో భయం పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!